Reading Time: < 1 minute
Ranveer Singh Next Movie Pralay Director Jai Mehta Kalyani Priyadarshan And Full Details

Ranveer Singh New Movie with Jai Mehta: ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 7 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ స్పై థ్రిల్లర్.. టూ థౌజండ్ క్రోర్ దిశగా దూసుకెళుతోంది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ తర్వాత రణవీర్ సింగ్ నెక్ట్స్ ఏ మూవీ చేయబోతున్నాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ధురంధర్ ఊహించని హిట్ తర్వాత పర్హాన్ అక్తర్‌కు హ్యాండిచ్చాడు గల్లీబాయ్. ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అంతకు ముందు సౌత్ దర్శకులు ప్రశాంత్ వర్మ, బాసిల్ జోసెఫ్‌తో కొంత కాలం ట్రావెల్ చేసి.. వాళ్ల టైం, ఎనర్జీని వేస్ట్ చేయించి తర్వాత గుడ్ బై చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఈ హీరోది.

Also Read: Mrunal Thakur Dating: ఆగిపోయిన డేటింగ్ వార్తలకు మృణాల్ మళ్లీ ఊపిరినిచ్చిందా?

బోయపాటి శీను, ఎస్ శంకర్ కూడా రణవీర్ సింగ్‌ను సెట్ చేసేందుకు ట్రై చేస్తున్నారట. కానీ రణవీర్ మాత్రం ఓ బాలీవుడ్ దర్శకుడికి కమిటయ్యాడని తెలుస్తోంది. రణవీర్ నెక్ట్స్ జాంబిస్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. స్కామ్ 1992 అసిస్టెంట్ డైరెక్టర్, లూటేరే సిరీస్ తెరకెక్కించిన జై మెహతా ఈ సినిమాను దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రళయ్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. లోకతో పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణి ప్రియదర్శన్.. రణవీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. జులై లేదా ఆగస్టు నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని బీటౌన్ టాక్.