July 12, 2026

మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొని.. స్కూటరిస్టు మృతి

మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొని.. స్కూటరిస్టు మృతి
Reading Time: < 1 minute

మెహదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొని.. స్కూటరిస్టు మృతి

Caption of Image.

అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.  వేగంగా వచ్చిన బస్సు వెనకనుంచి స్కూటర్ ను ఢీకొట్టడంతో  స్కూటరిస్టు అక్కడికక్కడే చనిపోయాడు. హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నంలో  గురువారం(మార్చి19) సాయంత్రం ఈ ఘటన జరిగింది వివరాల్లోకి వెళితే.. 

మెహదీపట్నం డిపోకు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు అతివేగంతో వచ్చి స్కూటర్ ను ఢీకొట్టింది.  బస్సుముందు వెళ్తున్న స్కూటర్ ను వెనకనుంచి బలంగా ఢీకొట్టడంతో స్కూటర్ పై వెళ్తున్న వ్యక్తి కిందపడిపోయాడు. అతని తలపైనుంచి బస్సు టైర్లు వెళ్లడంతో స్పాట్ లోనే చనిపోయాడు.  మొయినాబాద్ తాజ్ హోటల్ సమీపంలో బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

©️ VIL Media Pvt Ltd.