July 12, 2026

భారత జట్టులో మార్పులు.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్.. కొత్త ప్లేయర్స్కి ఛాన్స్!

భారత జట్టులో మార్పులు.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్.. కొత్త ప్లేయర్స్కి ఛాన్స్!
Reading Time: 2 minutes

భారత జట్టులో మార్పులు.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్.. కొత్త ప్లేయర్స్కి ఛాన్స్!

Caption of Image.

Team India: ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సతమతమైన భారత్ కి  BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఊహించని షాక్ ఇచ్చింది. జట్టులోని ఇద్దరు కీలక బౌలర్లు హ్యామ్‌స్ట్రింగ్ గాయాలతో రాబోయే సిరీస్‌లకు పూర్తిగా దూరమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ సందర్భంగా పేసర్ హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తీవ్రంగా ఇబ్బంది పడి మైదానాన్ని వీడారు. అనంతరం నిర్వహించిన స్కానింగ్ రిపోర్టులలో వీరికి తీవ్రమైన గాయాలని తేలడంతో, బీసీసీఐ సెలక్షన్ కమిటీ వీరి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను రీప్లేస్‌మెంట్లుగా ప్రకటించింది.  

హర్షిత్, వరుణ్ చక్రవర్తి ఔట్: 
భారత్ యువ పేసర్ హర్షిత్ రాణా ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రాగా, దురదృష్టవశాత్తు ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టీ20లో అతని రైడ్ హ్యామ్‌స్ట్రింగ్‌లో గ్రేడ్-1 గాయమైంది. దీంతో అతను ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే (ODI) సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు అదే మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి లెఫ్ట్ హ్యామ్‌స్ట్రింగ్‌లో గ్రేడ్-2 గాయం బయటపడింది. స్పెషలిస్ట్ వైద్యుల సలహా మేరకు వరుణ్‌ను జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టారు. ఈ ఇద్దరు స్టార్ బౌలర్లు చికిత్స కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కి రిపోర్ట్ చేయనున్నారు.

వన్డేల్లోకి ప్రిన్స్ యాదవ్.. జింబాబ్వే టూర్‌కు రవి బిష్ణోయ్:
బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం, ఇంగ్లండ్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం హర్షిత్ రాణా స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ప్రిన్స్ యాదవ్ ఇప్పటికే తన స్వింగ్ బౌలింగ్‌తో ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో సంచలనాలు సృష్టించాడు. ఇక జింబాబ్వేతో జరగబోయే కీలకమైన టీ20 సిరీస్ కోసం వరుణ్ చక్రవర్తి స్థానాన్ని భర్తీ చేసేందుకు స్టార్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన వెంటనే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇండియన్ టీమ్ జింబాబ్వే టూర్ కి వెళ్లనుంది.  

మార్పుల తర్వాత భారత్ వన్డే, టీ20 జట్లు ఇవే:
ఇంగ్లండ్ కి వెళ్లే వన్డే సిరీస్ జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.  

జింబాబ్వేకి వెళ్లే టీ20 సిరీస్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రవి బిష్ణోయ్.

 

©️ VIL Media Pvt Ltd.