July 12, 2026

మైసూర్ లోనే గానకోకిల అంత్యక్రియలు.. మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో కన్నీటి నివాళులు!

మైసూర్ లోనే గానకోకిల అంత్యక్రియలు.. మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో కన్నీటి నివాళులు!
Reading Time: 2 minutes

మైసూర్ లోనే గానకోకిల అంత్యక్రియలు.. మహారాజ కాలేజీ గ్రౌండ్స్‌లో కన్నీటి నివాళులు!

Caption of Image.

సంగీత ప్రపంచంలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది. తన సుమధుర కంఠంతో దశాబ్దాల పాటు కోట్ల మంది శ్రోతలను ఓలలాడించిన విఖ్యాత గాయని, గానకోకిల ఎస్‌.జానకి (88) శనివారం రాత్రి మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత వారం రోజులుగా శ్వాససంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం రాత్రి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. జానకమ్మ మరణవార్త యావత్ సినీ లోకాన్ని, సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ..

జానకమ్మ చివరి కోరిక మేరకు ఆమె అంత్యక్రియలను మైసూరులోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అభిమానుల ఆఖరి చూపు కోసం ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని చారిత్రాత్మక మహారాజ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఆమె పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ‘నవీన్ ఫామ్‌హౌజ్’ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి సిద్ధరామయ్య స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

సంగీత ప్రస్థానం-వ్యక్తిగత జీవితం..

ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జానకి జన్మించారు. శాస్త్రీయ సంగీతం ఎవరివద్దా పద్ధతిగా నేర్చుకోకపోయినా, రేడియోలో పాటలు వింటూ అద్భుతమైన గాత్రశిల్పాన్ని అలవర్చుకున్నారు. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’ ద్వారా మొదలైన ఆమె ప్రస్థానం.. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీతో పాటు దాదాపు 17 భాషల్లో 48 వేలకు పైగా తన గాత్రంలో అద్భుతమైన పాటలను పాడారు.. 

1959లో రామ్‌ప్రసాద్‌తో ఆమెకు వివాహమైంది. భర్త రామ్‌ప్రసాద్ 1997లోనే గుండెపోటుతో మరణించగా, ఈ ఏడాది జనవరిలో కుమారుడు మురళీకృష్ణ, ఆ తర్వాత కొద్దిరోజులకే మనవడు కూడా మరణించారు. వరుస విషాదాలతో జానకమ్మ కుంగిపోయారు. ఇప్పుడు ఆమె అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఒక సువర్ణ సంగీత శకం ముగిసినట్లయింది.

 

©️ VIL Media Pvt Ltd.