Reading Time: < 1 minute
Us Submarine Sinks Iranian Warship Iris Dena Sri Lanka Coast

Submarine Attack: శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రంలో అమెరికా సబ్‌మెరైన్(జలంతర్గామి) ఇరాన్ యుద్ధనౌకపై దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది మరణించినట్లు తెలిసింది. శ్రీలంక దక్షిణ తీరానికికి సమీపంలో ఇరాన్ నౌకపై అమెరికన్ జలంతర్గామి దాడి చేసిందని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధ్రువీకరించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ గతంలో పార్లమెంటుకు మాట్లాడుతూ మౌడ్జ్-క్లాస్ ఫ్రిగేట్ ఐరిస్ డేనాలో దాదాపు 180 మంది ఉన్నారని, అది ద్వీపం నుండి 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైందని చెప్పారు. అమెరికా తన సబ్ మెరైన్ నుంచి టార్పిడోలతో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసినట్లు తెలుస్తోంది.

Read Also: Holi Cleaning Tips: హోలీ రంగులు మీ ఇంటిని, గోడలను, ఫ్లోరింగ్‌ను మురికిగా మార్చేశాయా? ఇలా చేయండి చాలు..

ఐరిస్ డేనా భారత్ లో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026, మిలాన్ 2026లో పాల్గొని తిరుగి వెళ్తోంది. ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 25 వరకు బంగాళాఖాతంలో ఈ నౌకదళ విన్యాసాలు జరిగాయి. నౌక నుంచి ప్రమాద సంకేతాలు రాగానే వెంటనే శ్రీలంకన్ నేవీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. 32 మందిని రక్షించినట్లు, సముద్రం నుంచి అనేక మృతదేహాలను స్వాధీనం చేసున్నట్లు అధికారులు ప్రకటించారు. గాయపడిన వారికి గాలే లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిసతున్నారు. ఈ ఘటన అంతర్జాతీయ జలాల్లో జరిగింది.