Reading Time: < 1 minute
Andhra Pradesh Teenage Pregnancy Alert Womens Commission Highlights Causes Prevention

AP Teenage Pregnancy Alert: ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరుగుతున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆమె వెల్లడించారు. విశాఖపట్నం మినహా అన్ని జిల్లాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రోగ్రాములు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం పల్నాడు, కర్నూలు జిల్లాల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు..

Read Also: Rajini – Sharukh: రజనీకాంత్‌, షారూక్‌ ఖాన్‌ కాంబినేషన్‌ వర్కవుట్ అవుతుందా?

విజయవాడలో నిర్వహించిన టీనేజ్ లో గర్భధారణ నివారణపై రాష్ట్ర స్థాయి సలహా సమావేశంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చదువుకోకపోవడం వలన పిల్లలకు సరైన అవగాహన లేకపోవడం. సోషల్ మీడియా ద్వారా ఆకర్షణకు గురవడం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరత లాంటివి టీజేన్‌ ప్రెగ్నెన్సీ లకు కారణం అన్నారు.. అయితే, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం.. పిల్లలకు ఆరోగ్య అవగాహన కల్పించడం.. తల్లిదండ్రులకు సలహాలు మరియు అవగాహన కల్పించడం.. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ పరిస్థితికి చెక్‌ పెట్టవచ్చు అన్నారు.. అన్ని డిపార్‌పెంట్లలో కలిపి స్టేట్ లెవల్ మీటింగ్ ఏర్పాటు చేసాం. టీనేజ్ ప్రెగ్నెన్సీ తగ్గించడానికి అవగాహన, ఆరోగ్య విద్య, కుటుంబ సహకారం కీలకం.. ఈ ప్రయత్నాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో టీనేజ్ ప్రెగ్నెన్సీలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు రాయపాటి శైలజ..