Reading Time: < 1 minute
Chittoor Shocker Youth Killed In Firing Over Rs 2 Lakh Gambling Debt In Thimmanapalem

AP Crime: చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి.. పేకాట ఆడుతున్న సమయంలో రెండు లక్షల రూపాయల బాకీ డబ్బుల విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తగా.. చివరకు అది కాల్పులకు దారి తీసింది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యంలో జరిగిన ఈ ఘటనలో సాయికుమార్ (24) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పేకాట డబ్బుల బాకీపై మాటామాట పెరగడంతో డీల్లీ బాబు (26) నాటుతుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారే కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. ఇక, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.. అయితే, పేకాటలో పెట్టిన బాకీ ఓ స్నేహితుడి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలరలం రేపుతోంది..

Read Also: Realme GT 7: రియల్‌మి ఫోన్ చాలా తక్కువ ధరకే.. 7,000mAh బ్యాటరీ, 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌