Reading Time: < 1 minute
Bihar Political Shift 2026 Samrat Choudhary Tipped To Be Next Cm As Nitish Kumar Moves To Rajya Sabha

Bihar Next CM: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నితీష్ కుమార్‌ రాజ్యసభకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ రాజ్యసభకు వెళ్తే బీహార్సీఎం ఎవరు కాబోతున్నారనే దానిపై కీలక చర్చ నడుస్తోంది. మార్చి 16 తర్వాత నితీష్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాజ్యసభ పేపర్స్ రెడీ అయినట్లు సమాచారం.

జేడీయూ వర్గాల ప్రకారం.. నితీష్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారని, గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 16న రాజ్యసభకు ఎన్నికలు జరిగే వరకు ఆయనే బీహార్ సీఎంగా ఉంటారు. నితీష్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిశాంత్‌కు బీహార్ డిప్యూటీ సీఎంగా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం ఎవరు..?

ఇటీవల బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జేడీయూల ఎన్డీయే కూటమి సంచలన విజయం సాధించింది. 243 సీట్లకు గానూ ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. 89 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. జేడీయూ 85 సీట్లను సాధించింది. ఇక కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19, HAM-S‌కు 5 సీట్లు, RLMకు 4 సీట్లు ఉన్నాయి. ఈ సారి బీజేపీ తన అభ్యర్థిని బీహార్ సీఎంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని బీహార్ సీఎంగా చేయబోతున్నట్లు సమాచారం.