Reading Time: < 1 minute
Apco Launches 50 Discount Handloom Sale At Ap Secretariat Venkatagiri Gadwal Uppada Sarees Available

APCO Handloom Sale: చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. 50 శాతం డిస్కౌంట్లతో చేనేత వస్త్రాల అమ్మకాలు ప్రారంభం అయ్యాయి.. ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఆప్కో ఆధ్వర్యంలో ప్రత్యేక చేనేత కౌంటర్లను ప్రారంభించారు మంత్రి సవిత.. ప్రఖ్యాత గాంచిన వెంకటగిరి, గద్వాల్, మదనపల్లె, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి పట్టు, కాటన్ చీరలు, షర్ట్‌లు ఇతర రెడీమేడ్ చేనేత వస్త్రాలను ఈ కౌంటర్లలో విక్రయిస్తున్నారు..

Read Also: Holi Evening Remedies for Money: హోలీ సాయంత్రం ఈ పనులు మాత్రం మరవకండి.. మీకు ఎంతో ధన లాభం..!

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం.. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు, 50 శాతం డిస్కౌంట్ చేనేత వస్త్రాల అమ్మకాలు సాగిస్తామని తెలిపారు మంత్రి సవిత.. ఇక, ప్రత్యేక చేనేత స్టాళ్లకు సచివాలయ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేసిన చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఇతర అధికారులు, రాష్ట్ర సచివాలయం మహిళా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు..