
ఫిబ్రవరి నెలలో విడుదలైన ప్రేమకథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన సినిమా ‘విత్ లవ్’ (With Love). ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్ జీవింత్ వెండితెరకు ఈ మూవీతో నటుడిగా పరిచయం అయ్యారు.
రొమాంటిక్ కామెడీ జానర్‌లో వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 6, 2026న తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చేస్తోంది. కొత్త దర్శకుడు మదన్ తెరకెక్కించిన ఈ చిత్రం, ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఒక ఆధునిక ప్రేమకథలో ఎదురయ్యే సవాళ్లు, ఆకర్షణ, అపర్థాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సరళమైన కథనం, క్లీన్ కామెడీ ఉండటంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. కాగా.. ఈ మూవీని రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించారు.
►ALSO READ | పెళ్లి సంతోషం దేశమంతా: నగరాల్లో స్వీట్లు, ఆలయాల్లో అన్నదానం: విరోష్ జంటపై నెటిజన్ల ప్రశంసలు
కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ, ఇండియా వైడ్గా రూ.28.1 కోట్ల నెట్ కలెక్షన్ నమోదు చేసింది. వరల్డ్‌వైడ్‌గా రూ.34.89 కోట్లు వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.
దర్శకుడు మదన్ ఈ సింపుల్ ప్లాట్‌ను చాలా ఎమోషనల్‌గా, రిలేటబుల్‌గా తెరకెక్కించారు. ఫస్టాఫ్ అంతా కాలేజ్ రోజులు, స్నేహం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లతో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా స్కూల్ రోజులను గుర్తుచేసే సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ తమ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. సెకండాఫ్ పూర్తిగా డ్రామా మీద నడుస్తుంది.
📢 Finally it’s Confirmed, Official Announcement on the way 😀
Recent Rom-Com Movie 🤩❤️#WithLove (Tamil) streaming from March 6 on Netflix Tamil, Telugu, Hindi, Malayalam and Kannada 🍿!!#OTT_Trackers pic.twitter.com/uzWdy3QGBw
— OTT Trackers (@OTT_Trackers) March 1, 2026
కథేంటంటే:
ఈ కథలో సత్య శీలన్ (అభిషన్ జీవింత్) ఒక అర్టిటెక్ట్ డిజైనర్. ఇంట్లో వాళ్లు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన సత్య సోదరి, అమ్మాయి వివరాలు చెప్పకుండానే ఒక పెళ్లి చూపులను ఒక కాఫీ షాప్ లో ఫిక్స్ చేస్తుంది. అక్క మాట కాదనలేక వెళ్లిన సత్యకు అక్కడ మోనిష (అనస్వర రాజన్) పరిచయమవుతుంది. మోనిష ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.
మాటల సందర్భంలో.. సత్య తన స్కూల్ సీనియర్ అని మోనిష గుర్తిస్తుంది. అక్కడి నుంచి వారి సంభాషణ గతంలోకి మళ్ళుతుంది. తమ పాత ప్రేమలు, స్కూల్ క్రష్‌లు, విఫలమైన బంధాల గురించి చర్చించుకుంటారు. ఈ క్రమంలో మోనిష ఒక వినూత్నమైన ఐడియా ఇస్తుంది.
“మన పాత ప్రేమికులను మళ్లీ కలిసి, ఆ బంధాలకు ఒక క్లోజర్ ఇద్దాం అని ప్రతిపాదిస్తుంది. మరి ఈ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చింది? ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో వారు ప్రేమలో పడ్డారా? చివరికి సత్య ఎవరిని పెళ్లాడాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.