
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన విలక్షణమైన నటన, గంభీరమైన డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్నారు. గత ఏడాది ‘కన్నప్ప’ మూవీలో మెప్పించారు. ఇప్పుడు మరోసారి తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయ్యారు. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగపురం’. ఈ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.
‘వెంకటప్పయ్య నాయుడు’ గా..
ఈ రోజు ( ఫిబ్రవరి 28న ) ఈ సినిమాకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో మోహన్ బాబు పోషిస్తున్న “వెంకటప్పయ్య నాయుడు” పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఈ పోస్టర్‌లో మోహన్ బాబు లుక్ ఎంతో గంభీరంగా, రాజసంతో ఉట్టిపడుతోంది. కళ్ళలో తీక్షణత, ముఖంలో గర్వం, నడకలో ధైర్యం కలగలిసిన ఒక పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపిస్తున్నారు
అంచనాలు ఎలా ఉన్నాయంటే?
అజయ్ భూపతి తన సినిమాల్లో పాత్రలను ఎంత రా అండ్ రస్టిక్‌గా చూపిస్తారో మనకు తెలిసిందే. అదే తరహాలో మోహన్ బాబులోని అసలైన మాస్ అండ్ క్లాస్ యాంగిల్‌ను ఈ ‘వెంకటప్పయ్య నాయుడు’ పాత్ర ద్వారా బయటకు తీస్తున్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినా లేదా గంభీరమైన పెద్దరికం ఉన్న పాత్రలు చేసినా ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ‘శ్రీనివాస మంగపురం’ అనే టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా, లోపల కంటెంట్ మాత్రం చాలా ఇంటెన్సివ్‌గా ఉంటుందని ఫిలిం నగర్ టాక్.
►ALSO READ | రౌడీ కపుల్‌కు ‘రణబాలి’ టీమ్ సర్‌ప్రైజ్ గిప్ట్ ! ఐదు భాషల్లో ‘ఎందయ్య సామి’ సాంగ్ రిలీజ్!.
వారసుల ఎంట్రీ..!
ఈ సినిమా స్టార్ వారసుల ఎంట్రీకి కూడా వేదికగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని ఈ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఘట్టమనేని వారసుడి రాకతోఅభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Introducing the Legendary @themohanbabu garu as “VENKATAPPAYA NAIDU” from #SrinivasaMangapuram❤️🔥
Brace yourselves for his towering performance in a role carved with power and pride💥@DirAjayBhupathi #JayaKrishnaGhattamaneni #RashaThadani @AshwiniDuttCh @gemini_kiran @gvprakash pic.twitter.com/kB7D0kcJQL
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) February 28, 2026
భారీ నిర్మాణం
వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అజయ్ భూపతి, ఈసారి ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నట్లు సమాచారం. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు ప్రాణం పోస్తున్నారు. ఆయన అందించే నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం కానుంది. టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు అశ్వినీదత్ , జెమిని కిరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.