Reading Time: < 1 minute
మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా..? ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం..

19ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. రెండు దశాబ్దాల కడుపుకోతకు న్యాయం దక్కలేదు. ఇప్పుడు వారి చేతిలో కూతురు అవశేషాలు తప్ప ఏదీ మిగల్లేదు.  ఆయేషా మీరా తల్లిదండ్రులు పుట్టెడు ధుఃఖంతో.. విషణ్ణ వధనంతో సీబీఐ కోర్టులో ఆమె అవశేషాల కోసం నిలబడడం అందర్నీ కలచివేసింది. అవి అందుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు.. ఈ దేశం మొత్తాన్ని దోషులుగా నిలబెట్టాయ్.. ఇప్పుడు ఆమె చావు వెనుక కారకులతో పాటు ఆమె అవశేషాలు సైతం సమాధి చేయబడ్డాయ్..  ఇంత పెద్ద వ్యవస్థలు ఉండి.. ఒక్క ఆడబిడ్డకు న్యాయం చేయలేకపోయాం.. సిగ్గుగా ఉంది.. మమ్మల్ని క్షమిస్తావా ఆయేషా… ?