Reading Time: < 1 minute

ఖమ్మం  కవిత మెమోరియల్ కళాశాలలో  ఏఐపై అవగాహన కార్యక్రమం

Caption of Image.

ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో కవిత మెమోరియల్ డిగ్రీ & పీజీ కళాశాలలో ‘దైనందిన జీవితంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేఎల్ యూనివర్సిటీ (విజయవాడ) కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగాధిపతి డాక్టర్ కె.భగవాన్ హాజరై కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యత, దాని వినియోగం, భవిష్యత్ అవకాశాలపై విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కళాశాల యాజమాన్యం, నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి, కారస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణరావు, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎం.రంగారావు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.మురళీకృష్ణ, పీజీ అడ్మిషన్స్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి టి.కల్యాణనారాయణ (కేఎల్ యూనివర్సిటీ), మేనేజర్ షేక్ యాసీన్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.