Reading Time: 2 minutes

VIROSH Look Decode: విజయ్ రాజసం, యువరాణిలా రష్మిక.. విరోష్ వెడ్డింగ్ డ్రెస్సుల ప్రత్యేకతలివే

Caption of Image.

టాలీవుడ్ టాప్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అత్యంత వైభవంగా, రెండు వేర్వేరు సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఫిబ్రవరి 26న ఉడయ్‌పూర్‌లోని ప్రఖ్యాత ITC మేమెంటోస్ హోటల్ వేదికగా ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.

వివాహం అనంతరం విజయ్, రష్మికలు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. “రాజసం ఉట్టిపడేలా విజయ్”, “ఓరియంటల్ యువరాణిలా రష్మిక” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

డిజైనర్ అనామిక ఖన్నా మ్యాజిక్..

విజయ్–రష్మికల వివాహానికి సంబంధించిన ప్రత్యేక ఆకర్షణ వేషధారణే. ఈ జంట కోసం వెడ్డింగ్ డ్రెస్సులను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనామిక ఖన్నా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తెలుగు, కొడవ సంప్రదాయాల మేళవింపుతో రూపొందించిన ఈ డ్రెస్సులు సంప్రదాయానికి అద్దం పట్టాయి. స్టైలింగ్ బాధ్యతలను ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ అమి పటేల్ నిర్వహించారు.

మోడర్న్ ఫ్యాషన్ ఎక్కడా హద్దులు దాటకుండా, మొత్తం పెళ్లి వేడుక.. సంప్రదాయంలో కలిసిపోయేలా డిజైన్ చేయడం విశేషం. ఈ క్రెడిట్ పూర్తిగా అనామిక ఖన్నా, అమి పటేల్‌లకే దక్కుతుందని ఫ్యాషన్ వర్గాలు చెబుతున్నాయి.

వరుడిగా విజయ్ దేవరకొండ: సింప్లిసిటీలో రాజసం

విజయ్ దేవరకొండ ధరించిన ఐవరీ రంగు పట్టు ధోతి, గాఢ ఎరుపు అంగవస్త్రం సంప్రదాయ తెలుగు పెళ్లి వేషధారణకు చక్కని ఉదాహరణగా నిలిచాయి. అంగవస్త్రంపై ఆలయ శిల్పకళను తలపించే సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆభరణాలు: బంగారు హారం, భుజాల ఆభరణాలు, చిన్న కమ్మలు మాత్రమే ధరించి, అధిక ఆభరణాల అవసరం లేకుండా సింపుల్ లుక్‌లోనే రాజసంగా కనిపించారు. పూజా కార్యక్రమాల సమయంలో చెప్పులు లేకుండా ఉండటం సంప్రదాయానికి ఇచ్చిన గౌరవంగా హైలైట్ అయ్యింది.

పారాణి ప్రత్యేకత: అత్యంత విశేషంగా విజయ్ తన అరచేతులు, పాదాలకు పారాణి పెట్టుకోవడం సంప్రదాయ మూలాలను గుర్తు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంది.

పెళ్లికూతురిగా రష్మిక: ఓరియంటల్ యువరాణిలా

రష్మిక మందన్న పెళ్లికూతురిగా కనిపించిన తీరు ఓరియంటల్ యువరాణిలా అద్భుతమైన లుక్ లో దర్శనమిచ్చింది. నిజంగా చూపు తిప్పుకోలేని విధంగా అందమైన వేషధారణలో కనిపించింది. ఆమె ధరించిన ఆరెంజ్, గోల్డ్ రంగు బనారసి సిల్క్ శారీ, సంప్రదాయ మోటిఫ్స్ అందరినీ కట్టిపడేసింది. 

ఆభరణాలు: ఆమె ధరించిన కాసు మాలలు, లక్ష్మీ హారాలు, చోకర్లు, భుజాల గొలుసులు.. ఇలా అన్నీ ఆలయ శిల్పకళ ప్రేరణతో రూపొందినవే. అలాగే, రష్మిక నడుము వరకు జడకు పూల అలంకరణ, మధ్య వంపుతో చేసిన హెయిర్ స్టైల్ ఆమె సంప్రదాయ అందాన్ని మరింత పెంచాయి.

మేకప్ & హెయిర్: రష్మిక మేకప్ విషయంలో చాలా సింపుల్‌గా వెళ్లారు. సహజమైన గ్లో, తక్కువ మేకప్, మొగ్గలతో అలంకరించిన జుట్టు.. ఇలా అన్నీ కలిసి ఆమె సహజ అందాన్ని హైలైట్ చేశాయి.

ఫ్యాషన్‌కి మించిన ఎమోషనల్

ఈ టాప్ స్టార్స్ పెళ్లిలో ఫ్యాషన్ ఎక్కడ కనిపించలేదు. విలువైన అలంకరణ కనిపిస్తూనే, చాలా సహజమైన రీతిలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. జీలకర్ర బెల్లం, తలంబ్రాలు వంటి సంప్రదాయ కార్యక్రమాల సమయంలో పూల దండలు, సహజమైన అలంకరణలు ఆభరణాల సహజత్వాన్ని చూపించాయి.

ఇలా వీరిద్దరి వేషధారణ.. ప్రతి ఆభరణం ఆచారాలకి దగ్గరగా ఉంటటంతో వేడుకలో ప్రత్యేకతను చాటుకుంది. మొత్తంగా చెప్పుకోవాలంటే.. మూలాలను గుర్తు పెట్టుకుని, వాటిని గౌరవిస్తూ ముందుకు వెళ్లడమే నిజమైన ఆధునికత అన్న సందేశాన్ని ఈ పెళ్లి నిరూపించింది.

©️ VIL Media Pvt Ltd.