Reading Time: < 1 minute
Stephen Hawking Epstein Files Photo With Bikini Women Family Clarification

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యంగా, అమెరికా రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. లైంగిక నేరస్తుడు జేఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా సారీ చెప్పాల్సి వచ్చింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఫైల్స్ లో వచ్చింది. తాజాగా ఆయన ఇద్దరు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటో ఒకటి చర్చనీయాంశంగా మారింది.

Read Also: Puri Jagannadh: మరో తమిళ్ స్టార్ హీరోని పట్టేసిన పూరీ

ఇద్దరు మహిళలు బికినీలో స్మిమ్మింగ్ ఫూల్ వద్ద ఉండగా, వీరిద్దరి మధ్య స్టీఫెన్ హాకింగ్ సన్ లాంజర్‌పై ఉన్నారు. వీరి చేతుల్లో కాక్‌టెయిల్ డ్రింక్స్ ఉన్నాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఫోటో 2006లో సెయింట్ థామస్‌లోని రిట్జ్ కార్ల్‌టన్ హోటల్‌లో జరిగిన సైన్స్ సింపోనియం సందర్భంగా తీసిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో హాకింగ్ క్వాంటం కాస్మోలజీపై ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఎప్‌స్టీన్‌కు చెందిన 75 ఎకరాల ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లిన 21 మంది శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఒకరు.

అయితే, నివేదికల ప్రకారం హాకింగ్ పక్కన ఉన్న ఇద్దరూ కూడా ఆయన వ్యక్తిగత సహాయకులుగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్పష్టతనిచ్చారు. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు 24 గంటల వైద్య సహాయం, సంరక్షణ అసవరం అని, ఇద్దరు మహిళలు వైద్య సహాయం కోసం ఆయన వెంట ఉండేవారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఎప్‌స్టీన్ బాధితురాలు వర్జీనియా గిఫ్రే మాత్రం.. హాకింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొన్ని అనైతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆరోపించారు.