Reading Time: < 1 minute

ఆదిలాబాద్: కుమార్తె నిశ్చితార్థం రోజునే తండ్రి మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. బోథ్‌లో పందిరి శంకర్(45) అనే వ్యక్తి తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. కుమార్తెకు ఉట్నూరుకు చెందిన యువకుడి పెళ్లి నిశ్చయం చేశారు. సోమవారం యువకుడితో తన కుమార్తెకు నిశ్చితార్థం ఘనంగా జరిపాడు. బంధువులు, కుటుంబ సభ్యులతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. మంగళవారం ఉదయం నిద్రలో నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు తట్టిలేపడానికి ప్రయత్నించాడు. ఉలుకుపలుకు లేకపోవడంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయి ఉంటాడని వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.