Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్‌పై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈ నెల 27న విచారణ చేపట్టనున్నారు. 28న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటీషన్‌పై విచారణ జరుపనున్నారు. దానం నాగేందర్‌పై పిటీషన్ దాఖలు చేసిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని నాలుగు రోజుల కిందట దానం నాగేందర్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చే సిన సంగతి తెలిసిందే. 27న జరుగబోయే విచారణలో దానం నాగేందర్ తాను పార్టీ మారలేదు అ నడానికి తగు సాక్షాలను సమర్పించాల్సి ఉంది.