
Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి సినిమా విడుదల కావడం లేదని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’పై ఇప్పటికే ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు సమాచారం.
శర్వానంద్ ఇందులో ‘గంగా’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం ఏకంగా 30 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు తాజాగా మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ సినిమాలోని పీరియడ్ వరల్డ్, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ స్కేల్‌ను మరింత అద్భుతంగా చూపించేందుకు ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘భోగి’ని విడుదల చేయనున్నారు. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయ్యాక కొత్త రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.