Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్‌లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ‘. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ దశలో ఈ సినిమాకు సంబందించి ఎట్టకేలకూ ఒక సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చేసింది. “అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది” అంటూ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ఈ భారీ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3, 2026న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన పవర్‌ఫుల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రక్తపు మరకలతో, సిక్స్ ప్యాక్ బాడీతో, ఒక సైనికుడి గెటప్‌లో తీవ్రమైన భావోద్వేగంతో కూర్చొని కనిపిస్తున్నారు. చుట్టూ యుద్ధ భూమిలో పడి ఉన్న శవాలు, చేతిలో పట్టుకున్న గన్ చూస్తుంటే.. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ‘సలార్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రభాస్.. ఈసారి ‘ఫౌజీ’తో డిసెంబర్ 3న ఎలాంటి సునామీ సృష్టిస్తారో చూడాలి.