July 15, 2026

ముంబై ఇండియన్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త కెప్టెన్‌గా తిలక్ వర్మ 

ముంబై ఇండియన్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త కెప్టెన్‌గా తిలక్ వర్మ 
Reading Time: 2 minutes

ముంబై ఇండియన్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త కెప్టెన్‌గా తిలక్ వర్మ 

Caption of Image.

Mumbai Indians: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ (MI) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడేందుకు సిద్ధమవడంతో, ఎంఐ మేనేజ్‌మెంట్ సరికొత్త నాయకుడి కోసం వేటను స్టార్ట్ చేసింది. జట్టులోని మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో భారత జట్టుకు దూరం కావడం, రోహిత్ శర్మ కెరీర్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త లీడర్‌ను ఎంపిక చేయడంపై ముంబై యాజమాన్యం సన్నాహాలు మొదలు పెట్టింది.  

తిలక్ వర్మ vs జస్‌ప్రీత్ బుమ్రా: 
కొత్త కెప్టెన్ రేసులో ముఖ్యంగా తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రాల పేర్లు టాప్ లో వినిపిస్తున్నాయి. జట్టు భవిష్యత్తును ఆలోచిస్తే 23 ఏళ్ల తిలక్ వర్మ సరైన ఎంపిక అని ఎంఐ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రస్తుతం భారత్ టీ20 వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న అతడు, మరో పదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే ఛాన్స్ ఉండటం అతనికి కలిసి రానుంది. కానీ, అతడు వరల్డ్ క్లాస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. ఇక ఐపీఎల్‌లోనైనా కెప్టెన్సీ చేపట్టాలని గట్టి పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఒకవేళ తనను కాదని తిలక్ వర్మకు పగ్గాలు అప్పగిస్తే, బుమ్రా ముంబైని వీడే ప్రమాదం కూడా ఉందని క్రీడా పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | ఒక్క మ్యాచ్.. కోట్లాది ఫ్యాన్స్ వెయిటింగ్.. ఇంగ్లాండ్ vs అర్జెంటీనా పోరుకి బిగ్ హైప్

హార్దిక్ పాండ్యా ఔట్: 
గతంలో రోహిత్ శర్మ లాంటి సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌ను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం ముంబై ఇండియన్స్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. సీనియర్ల సహకారం కరువై, ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తీవ్ర ఒత్తిడికి గురైన పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వదిలి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ ముచ్చటని మేనేజ్‌మెంట్‌కు కూడా చెప్పేశాడు. ఈ క్రమంలో హార్దిక్ ని ట్రేడింగ్ ద్వారా తీసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పోటీ పడుతున్నాయి.  

రోహిత్ శర్మ లెగసీ: 
ముంబై ఇండియన్స్‌కు గతంలో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్, రిక్కీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు నాయకత్వం వహించినా.. రోహిత్ శర్మ తెచ్చిన 5 టైటిళ్ల రికార్డులే ఆ జట్టుని సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించాయి. భవిష్యత్తు కోసం రోహిత్‌ను తప్పించి హార్దిక్‌కి సారథ్య బాధ్యతలు ఇవ్వడం పూర్తిగా బ్యాక్‌ఫైర్ అయింది. ఇప్పుడు మేనేజ్‌మెంట్ తిలక్ వర్మ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుందా, లేక బుమ్రాకి ఛాన్స్ ఇస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. 

©️ VIL Media Pvt Ltd.