July 15, 2026

Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్

Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
Reading Time: < 1 minute
Prabhas Joins Hanu Raghavapudi Fauji Movie Shooting Schedule At Ramoji Film City

స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాకిస్తానీ నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది.

రామోజీ ఫిలిం సిటీలో ఈరోజు నుంచి ప్రభాస్ రెండు మూడు రోజులపాటు ఈ షెడ్యూల్లో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత యధావిధిగా స్పిరిట్ సినిమాకి కేటాయించిన డేట్స్ ప్రకారం ఆయన స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇక ఫౌజీ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమాకి బ్రేక్ ఇచ్చి మరి ఆయన ఫౌజీ షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా సమాచారం.

‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ ఒక సోల్జర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా కథ అయితే అద్భుతంగా వచ్చిందని, అనుకున్నది అనుకున్నట్టుగా తెరమీదకు వస్తే మాత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా ఈ సినిమా నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు. లవ్ స్టోరీలకు మంచి పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతూ ఉండడంతో, ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.