Reading Time: < 1 minute
Mahesh Babus Nephew Siddharth Galla Engaged To South Korean Girlfriend Hyein Kim

సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో సరికొత్త సంబరాలు మొదలయ్యాయి. మహేశ్ బాబు మేనల్లుడు గుంటురు మాజీ ఎంపీ జయదేవ్ గల్లా రెండవ కుమారుడు సిద్ధార్థ్ గల్లా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు సౌత్ కొరియాకు చెందిన హ్యేఇన్ కిమ్ తో సిద్ధార్థ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఘట్టమనేని, గల్లా కుటుంబాల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలో సిద్ధార్థ్, హ్యేఇన్ కిమ్ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. సౌత్ కొరియా సంస్కృతికి చెందిన అమ్మాయి ఘట్టమనేని ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతుండటంతో అభిమానులు సైతం ఈ క్రేజీ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

ఈ మధురమైన క్షణాలపై మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ స్పందించారు. కొత్తగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా  హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ “సిద్ధార్థ్, హ్యేఇన్ కిమ్‌లకు నిశ్చితార్థ శుభాకాంక్షలు. మీ ఇద్దరి భవిష్యత్తు ఎంతో సంతోషంగా, ప్రేమతో సాగిపోవాలని కోరుకుంటున్నాను” అంటూ నమ్రత రాసుకొచ్చారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సిద్ధార్థ్ గల్లా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతి ఘట్టమనేని కృష్ణ కుమార్తె గల్లా రామచంద్రరావుల కుమారుడనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుండటంతో ఘట్టమనేని ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి.