Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ‘RAW NTR’ వివాదంపై తారక్ టీమ్ సంచలన ప్రకటన

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తారక్ టీమ్ స్పందించింది. ఎన్టీఆర్ పేరుతో ‘RAW NTR’ అనే హ్యాండిల్ నుంచి వస్తున్న ప్రకటనలు, కార్యక్రమాలపై స్పందిస్తూ.. ఆ ఖాతాకు ఎలాంటి అధికారిక అనుమతి లేదని వెల్లడించింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఎన్టీఆర్ లేదా ఆయన టీమ్ నుంచి మాత్రమే అప్డేట్ వస్తుందని స్పష్టం చేసింది.
అలాగే ఈ నెల 18న ఎన్టీఆర్ తిరుపతికి వచ్చి రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏపీ కన్వీనర్ కృష్ణయాదవ్ ఖండించారు. ప్రస్తుతం తారక్ పూర్తిగా తన సినిమా ప్రాజెక్టులపైనే దృష్టి సారించారని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి వార్తలను కేవలం ఊహాగానాలుగానే చూడాలని సూచించారు. ఇటువంటి అనధికారిక సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ సమాచారమైనా అధికారిక వర్గాల నుంచి వచ్చే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ఆయన కార్యాలయం కోరింది. ఈ అంశంపై ఇదే తమ తుది వివరణ అని స్పష్టం చేసింది.
మంగళవారం (జులై 14, 2026న) ఎన్టీఆర్ టీమ్ అధికారిక ప్రకటనలో కీలక విషయాలు ప్రస్తావించింది. ‘‘ ‘RAW NTR’ పేరుతో పనిచేస్తున్న ఓ సంస్థకు ఎన్టీఆర్ గారితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరు, ఆయన కార్యాలయం పేరుతో ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆ సంస్థకు ఎలాంటి అనుమతి లేదని తెలిపింది. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేదా అధికారిక సమాచారం కేవలం ఆయన లేదా ఆయన అధికారిక బృందం నుంచే వస్తాయని వెల్లడించింది.
జూ.ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన..
ఈనెల 18న కార్యక్రమంపై స్పందించిన #JrNTR ఆఫీస్
RAW NTR సంస్థ కార్యకలాపాలతో సంబంధం లేదు.. RAW NTR సంస్థతో తమకెలాంటి సంబంధంలేదని ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటన
తెర వెనుక బుజ్జగింపులు జరిగి ఉంటాయా..? అని అనుమానిస్తున్న రాజకీయ విశ్లేషకులు pic.twitter.com/5Vw0nXuVUn
— Telugu Feed (@Telugufeedsite) July 14, 2026
అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అభిమానులు, మీడియాను కోరింది. ఈ అంశంపై ఇదే తమ తుది వివరణ అని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేస్తూ, అన్ని అపోహలు, వదంతులకు ముగింపు పలకాలని కోరింది. ఎన్టీఆర్‌పై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ తెలిపింది.
‘డ్రాగన్’ షూటింగ్లో ఎన్టీఆర్ బిజీ..
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర పేరు ‘లూగర్’. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇదొక అత్యంత ధైర్యమైన నిర్ణయమని ప్రశాంత్ నీల్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు నీల్ కెరీర్‌లో తాను రాసిన అన్ని పాత్రల కంటే ‘లూగర్’ పాత్ర అత్యంత క్రూరంగా, ఇంటెన్స్‌గా ఉంటుంది అని ఇటీవలే వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ మూవీ జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.