శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే అక్కడ చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మకర రాశి :మకర రాశి వారు కూడా ఖర్చులు ఎంత తగ్గించుకుంటే, అంత మంచిది లేకపోతే ఇది చాలా ఇబ్బందులు తీసుకొస్తుంది. కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగా అన్నివిధాలుగా చాలా జాగ్రత్తలు వ్యవహరించాలి. లేకపోతే గ్రహాల కారణంగా వీరు అన్నింట్లో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీన రాశి :మీన రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. కష్టానికి తగిన ఫలితం లభించదు. అంతే కాకుండా ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అనుకోకుండా కోపం వస్తుంది. అధిక కోపం వలన కొన్ని సార్లు మీరు చాలా కోల్పోయే ఛాన్స్ ఉంది. అందువలన చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. వీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా అన్నివిధాలుగా నష్టాలు ఎదుర్కుంటారు. మీరు చేసే చిన్న పొరపాటే, పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




