ఆదిత్య బిర్లా చేతికి.. బ్రిటీష్ కంపెనీ సోలెనర్జీ పవర్ Caption of Image.
న్యూఢిల్లీ: బ్రిటిష్ ఆయిల్ కంపెనీ షెల్‌కి చెందిన సోలెనర్జీ పవర్‌ను కొంటున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రకటించింది. ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్ ద్వారా దీనిని దక్కించుకుంటున్నామని తెలిపింది. ఇందుకోసం డెఫినిటివ్ అగ్రిమెంట్‌పై సంతకాలు జరిగాయి. ఈ భారీ డీల్ విలువ 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.17,225 కోట్లు) ఉంటుంది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా రెన్యూవబుల్స్, షెల్ ఓవర్సీస్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి సోలెనర్జీ పవర్ ప్రైవేట్‌లో 100 శాతం షేర్లను కొనుగోలు చేయనుంది. సోలెనర్జీ పవర్ కింద స్ప్రింగ్ ఎనర్జీ గ్రూప్ కంపెనీలు కూడా ఉన్నాయి.