పబ్లిక్ ప్లేసుల్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు పెట్టండిCaption of Image.
బాలికలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ టైం ఇవ్వాలి
రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల ప్రతిపాదనలు
క్యూర్ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యూర్ యాక్ట్–2026పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల ప్రతినిధులతో సోమవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో ఇంటరాక్టివ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ప్రతినిధులు పలు ప్రతిపాదనలు చేశారు.
కమిటీల్లో ఆర్‌డబ్ల్యూఎస్ ప్రతినిధులకు చోటు కల్పించాలని, బాలికలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ టైం ఇవ్వాలని కోరారు. పబ్లిక్ ప్రదేశాల్లో శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలన్నారు. మహిళల భద్రతకు మెరుగైన లైటింగ్ ఉండాలని, నిఘా పెంచాలని కోరారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని జయేశ్ రంజన్ హామీ ఇచ్చారు.