Reading Time: < 1 minute

నిద్ర లేచేసరికి గతం మాయమైతే.. ఇంట్రెస్టింగ్ స్టోరీతో ది మేజ్

Caption of Image.

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్’.   ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాక్టర్ రవికిరణ్ గడలాయ్ దర్శకత్వంలో  డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. 

తాజాగా  ఈ సినిమా నుంచి రివర్స్ టీజర్ రిలీజ్ చేశారు.  ‘కన్ను మూసి తెరిచే సరికి ఈ ప్రపంచం అతని  గతాన్ని మాయం చేసింది..  అతను మాత్రమే నమ్మే నిజాన్ని కలగా మార్చేసింది..’  అని చెబుతూ ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమవుతుంది.  నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచిన హీరో మదిలో అనేక సంఘటనలు మెదులుతుంటాయి. 

ఎవరూ నమ్మని, తను మాత్రమే నమ్మే కొన్ని నిజాలు, వాటి రుజువుల కోసం అతను అన్వేషణ సాగిస్తుంటాడు.  కొంతమంది వ్యక్తులను వెంబడిస్తుంటాడు. హీరో భ్రమపడుతున్నాడని ఇతరులు అనుకున్నవి నిజంగా భ్రమలేనా ?, లేక హీరో బలంగా నమ్మినట్లు వాస్తవాలా ? ఈ సందిగ్ధ పరిస్థితులకు కారణం ఎవరు?, 

ఈ ప్రయాణంలో హీరోను నమ్మి వెనక అండగా ఎవరు నిలబడ్డారు? అతను ఎలా గాయపడ్డాడు? హత్యల్ని ఆపే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఎవరి కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తోంది? వంటి అంశాలు టీజర్‌‌‌‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్‌‌ చేయనున్నారు మేకర్స్.

©️ VIL Media Pvt Ltd.