Reading Time: 2 minutes

సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిని.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలందించేందుకు సనత్ నగర్ టిమ్స్ అందుబాటులోకి వచ్చింది. సోమవారం (ఆగస్టు 17) సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు.  కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇది. 11వందల బెడ్లు,  300 ఐసీయూలతో, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యంతో ప్రజలకు వైద్య సేవలను అందించబోతోంది.ఈ ఆస్పదేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చారు. ఆస్పత్రిలో ఎక్కడికైనా 2 నిమిషాల్లోనే శాంపిల్స్​, రిపోర్ట్స్​, మందులు, పరికరాలు చేరవేసే సదుపాయం ఉంది. 22.6 ఎకరాల విస్తీర్ణంలో, 11.70 లక్షల చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో నాలుగు ప్రధాన బ్లాకులుగా క్లాసిక్ ఆర్కిటెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. 

డయాగ్నస్టిక్స్ విభాగంలో 17 పాథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయోకెమిస్ట్రీ, మరో 5 స్పెషల్ ల్యాబ్‌‌‌‌లను ఏర్పాటు చేశారు. బ్లాక్ –ఏలో ఎమర్జెన్సీ డిపార్ట్‌‌‌‌మెంట్, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఐసీయూ బెడ్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

బ్లాక్–బీలో ఓపీ రిజిస్ట్రేషన్, సెంట్రల్ ఫార్మసీ, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లీనాక్ ఆధారిత న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు క్యాథ్‌‌‌‌ల్యాబ్‌‌‌‌లు ఉన్నాయి. బ్లాక్-సీలో రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌‌‌‌లతో పాటు సాధారణ, ప్రైవేట్ వార్డులు, వీఐపీ సూట్లు ఉన్నాయి. బ్లాక్ డీని అడ్మినిస్ట్రేషన్, అకడమిక్ విభాగాలతో పాటు 200 మంది కూర్చునే ఆడిటోరియంతో తీర్చిదిద్దారు.

ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌‌‌‌తో శాంపిల్స్…

దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా బ్లడ్ శాంపిల్స్, మందులు, రిపోర్టులు, ఎమర్జెన్సీ వస్తువులను వార్డులు, ఐసీయూ, ల్యాబ్‌‌‌‌లు, బ్లడ్ బ్యాంక్‌‌‌‌ల మధ్య కేవలం 1 నుంచి 2 నిమిషాల్లోనే చేరవేయవచ్చు. రోగ నిర్ధారణ కోసం 3.0 టెస్లా ఎంఆర్‌‌‌‌ఐ, 128-స్లైస్ సీటీ స్కానర్, అడ్వాన్స్‌‌‌‌డ్ మామోగ్రఫీ, 5 ఎక్స్‌‌‌‌రే యూనిట్లను సమకూర్చారు. రోగుల సహాయకుల కోసం జీ+5 అంతస్తుల్లో 200 మంది సామర్థ్యంతో ధర్మశాల నిర్మించారు. 30 డెడ్‌‌‌‌బాడీల సామర్థ్యంతో మార్చురీ, సెంట్రల్ కిచెన్, లాండ్రీ, మెడికల్ ఆక్సిజన్ పైప్‌‌‌‌లైన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పర్యావరణ అనుకూలంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు 75 శాతం నీటిని ఆదా చేస్తూ ఐజీబీసీ గోల్డ్ రేటింగ్‌‌‌‌ను దక్కించుకుంది. 

©️ VIL Media Pvt Ltd.