Reading Time: < 1 minute

వృద్ధుల కోసం సీఎం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్.. 38 లక్షల మందికి లబ్ది

Caption of Image.

పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన సీఎం విజయ్ జోసెఫ్.. పాలనలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు చారిత్రాత్మక నిర్ణయాలతో శభాష్ అనిపించుకునే నిర్ణయాలు తీసుకున్న సీఎం విజయ్.. లేటెస్టుగా వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభించి ప్రశంసలు అందుకుంటున్నారు. 

 ముఖ్యమంత్రి వృద్ధుల ఆరోగ్య భీమా (సీఎం ఎల్డర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్) పేరుతో వృద్ధులకు అండగా ఉండేందుకు తమిళనాడు ప్రభుత్వం కొత్త స్కీమ్ ప్రారంభించింది. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వృద్ధులకు చేయూతనిస్తూ వారి ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకునేలా సీఎం విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఈ స్కీమ్ కు సంబంధించి ఇన్కమ్ సీలింగ్ అంటూ ఏమీ లేదు. అంటే ఎంత ఇన్ కమ్ ఉన్నవారికైనా.. హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్ రాజ్ సోమవారం (ఆగస్టు 17) అసెంబ్లీలో ప్రకటించారు. దీర్ఘ కాలిక వ్యాధులకు, గుండె సంబంధిత వ్యాధులకు అలాగే అవయవ మార్పిడి చికిత్సలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని కేజీ.అరుణ్ తెలిపారు. 

ఈ స్కీమ్ ప్రకారం.. అధునాతన చికిత్సలు వృద్ధులకు అందుతాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా స్కీమ్ అమలులో ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి విదివిధానాలు ప్రకటించలేదు. అయితే కేంద్రప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ తో అనుసంధానించనున్నట్లు తెలిపారు.  

సీఎం ఎల్త్ ఇన్సరెన్స్ స్కీమ్ ప్రస్తుతం కోటి 45 లక్షల కుటంబాలు సేవలు పొందుతున్నాయి. ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల కవరేజీ అందిస్తోంది. స్పెషల్ కార్పస్ కింద అవయవ మార్పిడి, ఇతర సర్జరీలకు స్పెషల్ కార్పస్ కింద  మొత్తం 23 లక్షల వరకు ప్రభుత్వం సహాయం చేయనుంది. 

©️ VIL Media Pvt Ltd.