
Rinku Singh Funny Reply: భారత యంగ్ సిక్సర్ల కింగ్ రింకూ సింగ్ మైదానంలోనే కాదు, బయట కూడా తన చమత్కారంతో అభిమానులను విశేషంగా అలరిస్తుంటాడు. క్రికెట్ గ్రౌండ్‌లో క్లిష్ట సమయాల్లో సిక్సర్లు బాదే రింకూ, బయట తన టైమింగ్ పంచ్‌లతో ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక కంటెంట్ క్రియేటర్ సరదాగా రింకూ సింగ్ వైపు చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పగా.. దానికి రింకూ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
నేనేమైనా నీ గర్ల్‌ఫ్రెండ్‌నా?:
ఫ్యాన్స్, క్రియేటర్లతో క్యాజువల్‌గా మాట్లాడుతున్న సమయంలో ఒక వీడియో క్రియేటర్ సరదాగా రింకూపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. దానికి అస్సలు తడబడకుండా, నవ్వుతూ తనదైన మార్కు హిందీ స్టైల్లో మై గర్ల్‌ఫ్రెండ్ హూన్ తుమ్హారీ? (నేనేమైనా నీ గర్ల్‌ఫ్రెండ్‌నా ఏంటి?) అంటూ ఒక్క డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చాడు. సడెన్ గా వచ్చిన ఈ ఐ లవ్ యూ కాంప్లిమెంట్‌ను రింకూ అంత సరదాగా మార్చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.
రింకూ సింగ్ హ్యూమర్‌పై ప్రశంసల వర్షం:
రింకూ సింగ్ ఇచ్చిన ఈ వన్ లైనర్ రెస్పాన్స్ క్లిప్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎంత పెద్ద క్రికెటర్‌గా ఎదిగినా తన సింప్లిసిటీని, సరదా స్వభావాన్ని వీడకపోవడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్‌లో మాత్రమే కాదు, బయట కూడా రింకూ టైమింగ్ వేరే లెవల్ అని, ఈ వీడియో ఆయనలోని ఫన్నీ యాంగిల్‌ను మరోసారి చూపిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.