Reading Time: < 1 minute

మా నడిమిట్లకొస్తే ఒమన్పై బాంబేస్తాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్

Caption of Image.

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్‌తో అమెరికాకు ఉన్న ఘర్షణ వాతావరణంలో మిడిల్ ఈస్ట్ దేశమైన ఒమన్ అడ్డు వస్తే ఆ దేశాన్ని నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ గడువుకు కొన్ని రోజుల ముందు.. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ హెచ్చరిక ప్రకటన చేశారు. “ఒమన్ అడ్డుపడితే, వాళ్ళను బాంబులతో నాశనం చేస్తాం,” అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.

గత కొన్ని వారాలుగా, హోర్ముజ్ జలసంధి నుంచి నౌకా రవాణా నిర్వహణకు సంబంధించిన తాత్కాలిక ఏర్పాటు కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరాన్ దౌత్యవేత్తలు ఒమన్ అధికారులతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. మిడిల్ ఈస్ట్ వార్లో అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఒకటిగా మారిన హోర్ము్జ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరాన్, ఒమన్‌ల మధ్య జరుగుతున్న  చర్చల గురించి మీడియా అడిగిన సందర్భంలో ట్రంప్ ఈ కీలక హెచ్చరిక చేయడం గమనార్హం.

►ALSO READ | లక్ష్మీ మిట్టల్ ఉక్రెయిన్ స్టీల్ ప్లాంట్ పై రష్యా మిసైల్ దాడి.. ఇద్దరు మృతి

©️ VIL Media Pvt Ltd.