Reading Time: < 1 minute

ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్ల విక్రయం..ఐదుగురిపై కేసు, ముగ్గురు అరెస్ట్

Caption of Image.

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: నకిలీ పత్రాలతో ఆదిలాబాద్​ పట్టణంలోని హౌసింగ్​ బోర్డు కాలనీకి చెందిన ఓ మహిళకు ఆరు ప్లాట్లను అమ్మి రూ.42 లక్షల కాజేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్​ చేసినట్లు మావల ఎస్ హెచ్​వో బీడీ ప్రేమ్​కుమార్​ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన టోకల బుచన్న, బొల్లి రాజు అలియాస్​ రాజన్న, బాలే నర్సింలు, ఏనుగు నవీన్  కుమార్, రాంపూర్​ గ్రామానికి చెందిన ఎల్టి లక్ష్మణ్ రెడ్డి అలియాస్​ లచ్చారెడ్డి కలిసి నకిలీ పేపర్లు, ఫోర్జరీ సంతకాలతో బట్టి సావర్గాం గ్రామ పరిధిలో ప్లాట్లు ఉన్నట్లు చూపించి బి పుష్పలత అనే మహిళకు అమ్మారు. 

2021 ఆగస్టు 9న రిజిస్ట్రేషన్  డాక్యుమెంట్ల ద్వారా  ప్లాట్లు కొనుగోలు చేసిన అనంతరం బాధితురాలు హద్దులు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా, ఆ ప్లాట్లు వేరే వారివని స్థానికులు చెప్పారు. దీంతో తహసీల్దార్  ఆఫీస్​లో రికార్డులు పరిశీలించగా, సంబంధిత భూమిపై విక్రయదారుల పేర్లు లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులను అరెస్ట్​ చేయగా, ఏనుగు నవీన్ కుమార్, బాలే నర్సింలు పరారీలో ఉన్నట్లు ఎస్ హెచ్​వో తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.