కుంభ రాశి : కుంభ రాశి వారు చాలా సౌమ్యమైన వ్యక్తులు. వీరు ఎంత ప్రేమగా ఉంటారో అంతే కటువుగా కూడా ఉంటారు. అయితే వీరు ఏ విషయంలో ఎలా ఉన్నా, తమ భర్తల విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటారంట. వారిని తమ కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారంట.
సింహ రాశి : సింహ రాశి వారు చాలా నిర్మలమైన మనస్సు కలవారు. అంతే కాకుండా వీరు తమ భర్తకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారంట. అన్ని సమయంలో తన భర్తకు అండగా నిలవడమే కాకుండా సమాజంలో వారికి ప్రత్యేక గౌరవం లభించేలా చేస్తారని చెబుతున్నారు పండితులు. అందుకే ఈ రాశి స్త్రీలను చేసుకునే పురుషులు అదృష్టవంతులు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు చాలా అందమైన వారు మంచి ఆకర్షణీయరూపం కలిగి ఉంటారు. ఈ రాశి వారు కూడా తమ భర్తకు అత్యధిక ప్రియారీటి ఇస్తారు. అంతే కాకుండా వీరు చెప్పినట్లే వారు నడుచుకునేలా వారిని మార్చుకుంటారు. ఇద్దరూ చాలా సఖ్యతగా ఉంటూ, కుంటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు.
మీన రాశి : మీన రాశి వారికి వాక్ చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు తమ మాటలతోనే అందరినీ మాయ చేస్తారుజ. అంతే కాకుండా తమ భర్తలను కూడా మాటలతోనే మాయ చేసి తమ చుట్టూ తింపుకుంటారు. కానీ భర్తకు మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అన్ని విధాలుగా వారికి అండగా నిలుస్తారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




