Reading Time: < 1 minute
సంక్రాంతికి కొత్త సినిమాల ఎంట్రీ.. థియేటర్స్ కోసం ఫైట్ తప్పదేమో..?

2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.. 4 ముందే దర్శక నిర్మాతలు పండగ రేసులో కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. పాత సినిమాలకు తోడుగా కొత్త క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ఫెస్టివల్ బరిలోనే దిగేందుకు ఆసక్తి చూపిస్తూ క్యూ కడుతున్నాయి. ఇంతకీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న ఆ భారీ సినిమాలేంటో చూద్దామా? చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158వ చిత్రం ఆన్ టైమ్‌లో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా.. దీని షూట్ కూడా వేగంగా జరుగుతుంది. పైగా చిరంజీవి రీ ఎంట్రీలో ఖైదీ నెం 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు పండక్కే వచ్చి హిట్టవ్వడంతో.. ఆ సెంటిమెంట్‌ను గట్టిగా నమ్ముతున్నారు చిరు. అందుకే మెగా 158ను పండక్కే ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో సంక్రాంతి అల్లుడు అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. తన సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ను సిద్ధం చేస్తున్నారు. పండక్కి మళ్లీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు.. ఇప్పటికే ఫస్టాఫ్ షూటింగ్ కూడా అయిపోయింది.. ఆన్ టైమ్ పండక్కి ల్యాండ్ కానున్నారు అనిల్. సంక్రాంతికి 100 పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న శర్వానంద్.. సీనియర్ దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి జార్జ్ క్రిష్ అంటూ పండగ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకున్నారు. జనవరి 14న సినిమా విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల.. 2010లో వచ్చిన నమో వెంకటేశ తర్వాత పండగ సీజన్‌లో రానున్నారు. ఇలా స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ముందుగానే సీట్లు రిజర్వ్ చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. ఆకాశంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత

ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్‌ చూసి గుండె గుభేల్‌

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!