
ఏపీ సీనియర్ రాజకీయ నేత, మాజీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లీడర్, మాజీఎంపీ విజయ్ సాయి రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని ఈ ప్రకటన చేశారు. ప్రజల తరపున,ప్రజలకోసం, ప్రజాపక్షంగా నిలబడేందుకు తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు చెప్పారు.విజయవాడ వేదికగా తర్వలో పార్టీ పేరు, కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ లో ప్రజల గొంతుకను బలంగా వినిపించడమే లక్ష్యంగా కొత్త పార్టీ పనిచేస్తుందని చెప్పారు విజయ్ సాయిరెడ్డి.
బుధవారం (ఆగస్టు19) ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న విజయ్ సాయి రెడ్డి కొత్తపార్టీపై ప్రకటన చేశారు. ఒక లాయర్ గా, బాధ్యతాయుతమైన ప్రతినిధిగా ప్రజలతరపున పనిచేస్తానని అన్నారు. ఆగస్టు చివరి వరకు విజయ వాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, పార్టీ కార్యచరణను వెల్లడిస్తానని చెప్పారు.
ఏపీలో వర్షాభావం, ఎల్ నినో ప్రభావం లేకుండా పుష్కలంగా వర్షాలకురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు విజయ్ సాయి రెడ్డి తెలిపారు.