Reading Time: 2 minutes
Telugu Youth Drama Husharu Pittalu On Amazon Prime Video Ott

Husharu Pittalu OTT Release: థియేటర్లలో విడుదలైన తర్వాత తెలుగు రొమాంటిక్ డ్రామా ‘హుషార్ పిట్టలు’ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి కూడా సిద్దమవుతోంది ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. బోల్డ్ కథాంశం, టీనేజ్ రిలేషన్‌షిప్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. యూత్ రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కలిసిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మరి ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే..

త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

‘హుషార్ పిట్టలు’ (Husharu Pittalu) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) దక్కించుకుంది. థియేటర్లలో ఈ టీనేజ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న  విడుదలైంది. విడుదలైన 3 నుండి 4 వారాల తర్వాత, అంటే 2026 సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం. కొత్త జంట అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాకు బిక్షు యాదవ్ దర్శకత్వం వహించారు. రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని కూడా పలకరించేందుకు సిద్దమవుతోంది.

‘హుషార్ పిట్టలు’ కథ

ఈ కథ అంతా తెలంగాణలోని ఒక గ్రామానికి చెందిన రవి (అన్షు), పుట్ట చిట్టి (వాసవి గణేషన్) అనే ఇద్దరు టీనేజ్ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చే రవి, స్నేహితుల వల్ల, స్మార్ట్‌ఫోన్ లో దొరికే ఇంటర్నెట్ చెడు ప్రభావాల వల్ల అశ్లీల కంటెంట్‌కు బానిసవుతాడు. అదే సమయంలో తొమ్మిదో తరగతి చదివే చిట్టి, రవి వైపు ఆకర్షితురాలవుతుంది. తెలిసి తెలియని వయసులో వీరి మధ్య ఏర్పడిన శారీరక ఆకర్షణ.. చివరకు చిట్టి గర్భం దాల్చే వరకు వెళ్తుంది. ఈ ఊహించని పరిణామం వల్ల ఆ ఇద్దరి చదువు, జీవితాలు ఎలా రోడ్డున పడ్డాయి ? వారి కుటుంబాలు ఎలాంటి మానసిక క్షోభను అనుభవించాయి? నేటి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూపిస్తూ, కళ్ళు తెరిపించే కథాంశమే ఈ చిత్రం.