Reading Time: 2 minutes

జ్యోతిష్యం:తొలి సంపాదన దేవుడికి ఎందుకు ఇస్తారు..అలా చేయకపోతే ఇబ్బందులు వస్తాయా..

Caption of Image.

కొత్తగా ఉద్యోగం వచ్చినా.. కొత్తగా తీసుకొచ్చిన వస్తువులను..ఏడాదిలో చెట్ల నుంచి వచ్చిన మొదటి ఫలాన్ని దేవుడికి సమర్పిస్తారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం.  అలా ఎందుకు సమర్పిస్తారు.  దీని వెనుక ఉన్న ఆచారం ఏమిటి.. అలా చేయకపోతే ఇబ్బందులు ఏమైనా వస్తాయా..అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది.. ఈ విషయంలో పండితులు.. ఆధ్యాత్మికవేత్తలు.. పెద్దలు ఏం చెబుతున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .!

హిందువుల పూజలు.. దేవుడిని ఆరాధించడం.. మొక్కులు చెల్లించడం .. ఆచారాలు.. సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మనకు ఉద్యోగం వచ్చినా.. ఎంతో లాభం వచ్చినా.. పంటలు పండినా అదంతా భగవంతుని అనుగ్రహం వలన వచ్చిందని భావిస్తారు.  మనకు అంతటి ప్రతి ఫలాన్ని కలుగజేసిన దేవుడికి కృతఙ్ఞతగా సమర్పించే ఆచారం అనాదిగా వస్తుంది. 

ఎవరు ఏ పని చేయాలన్నా.. అందులో రాణించాలన్నా.. తల పెట్టిన పని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా… వ్యాపారంలో మంచి లాభాలు రావాలన్నా.. ఉద్యోగం రావలన్నా.. మంచి సంపాదన ఉండాలన్నా కచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాల్సిందేనని పండితులు చెబుతున్నారు.  భగవంతుని ఆశీస్సులు వలన తలపెట్టిన పని పూర్తి అయిందని..మంచి ఉద్యోగం వచ్చిందని దేవుడికి కృతఙ్ఞతగా మొదటి ఆదాయాన్ని ఇస్తుంటారు. 

మనకు ఎంత తెలివితేటలున్నా.. ఎంత సామర్థ్యం ఉన్నా దేవుని కృప లేనిదే జీవితంలో రాణించడం చాలా కష్టమని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవుని ఆశీస్సులు ఉన్నప్పుడు మాత్రమే ఆ తెలివితేటలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.  కొంతమందికి ఎన్ని తెలివితేటలున్నా.. చదువులో మంచి ర్యాంకు వచ్చినా.. జాబ్​ మాత్రం రాదు. అంటే వారికి దేవుడి ఆశీస్సులు లేవని అర్దమని పండితులు చెబుతున్నారు.  కాని విద్యార్థి దశలో అల్లరి చిల్లరగా తిరిగి.. అత్తెసర మార్కులు సాధించిన వారు మాత్రం మంచి ఉద్యోగం సాధించి తొందరగా స్థిరపడతారు.  అంటే వారికి దేవుని ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతుంటారు. 

పురాణాల ప్రకారం.. ఈ ప్రపంచంలోని ప్రతిదీ దేవునికి చెందినది.  వ్యక్తిగతంలో ఎవరికి ఏదీ సొంతంగా ఉండదు. మొదటగా సంపాదించిన ఆదాయం.. లేదా తోటలో కాసిన మొదటి ఫలం దేవుడికి ఇస్తే ఆయన  ఇచ్చిన దానిలో కొంత ఆయనకు ఇచ్చి మిగతాది మన అవసరాలకు వాడుకుంటాం. మొదటి సంపాదన అందుకున్న సమయంలో.. తోట నుంచి ప్రతి ఏడాది మొదటి ఫలాన్ని అందుకున్నప్పుడు.. ఇదంతా కేవలం నాల్లే వచ్చింది.. నేనే సంపాదించారు అనే గర్వం వస్తుంది. అందుకే  తొలి సంపాదనను దేవునికి సమర్పించడం …  దానధర్మాలకు ఉపయోగించడం వలన  అహంకారం.. ధనాశ తొలగుతుంది. అలా చేసిన వారు ఒదిగి ఉండేలా.. వినయంగా ఉండేలా చేస్తుంది.

హిందూ పురాణాల ప్రకారం… తొలి సంపాదనను దానంచేయడం వలన అలా వచ్చిన ఆదాయం అంతా పవిత్రంగా ఉంటుందని భావిస్తారు. భగవంతుని ఆశీస్సులతో వచ్చిన ఆదాయంతో ఆ ఇంట్లో సంతోషం.. శ్రేయస్సు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.