Reading Time: < 1 minute

ఉదయం 4 గంటలకే ఫోన్లు.. 20 గంటల పని: సీఎం విజయ్ డైలీ షెడ్యూల్ రివీల్ చేసిన మంత్రి

Caption of Image.

చెన్నై: స్టార్ యాక్టర్, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ డైలీ షెడ్యూల్, సీఎంగా ఆయన తీరుపై మంత్రి ఆదవ్ అర్జున ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. విజయ్ డైలీ 20 గంటలు పని చేస్తాడని తెలిపారు. ఉదయం నాలుగు గంటలకే లేచి పని మొదలు పెడతారని.. ఉదయాన్నే మంత్రులకు ఫోన్ చేసి సంబంధిత శాఖల పని తీరు గురించి ఆరా తీస్తారని చెప్పారు. 

ఇక, తొలి ఎన్నికల్లోనే టీవీకే ఘన విజయం సాధించినప్పటికీ విజయ్‎లో ఏం మాత్రం అహంకారం లేదన్నారు. కేవలం పరిపాలనపైనే దృష్టి పెట్టారని.. విజయ్‎ను చూస్తుంటే ఒక పొలిటికల్ మాంక్ (రాజకీయ సన్యాసి)లా కనిపిస్తున్నారన్నారు. అవినీతి నిర్మూలనపై విజయ్ సీరియస్‎గా ఫోకస్ చేశారని తెలిపారు. ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడం, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకుని అన్ని శాఖల్లో పూర్తి పారదర్శకతను తీసుకురావడమే ధ్యేయంగా సీఎం విజయ్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 

తొలి ఎన్నికల్లోనే టీవీకే ఘన విజయం:

2026, ఏప్రిల్‎లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా 2026, మే 10న సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. పాలనలో విజయ్ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి నిర్మూలనపై సీరియస్‎గా ఫోకస్ పెట్టారు. అలాగే, ఫ్రీ కరెంట్, మహిళల భద్రత కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్, రైతు రుణమాఫీ,  ప్రత్యేక యాంటీ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌, వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పలు పథకాలు స్టార్ట్ చేశారు. 

►ALSO READ | మధ్యతరగతి ప్రజలే ప్రభుత్వానికి ATMలా మారారు.. ఆదాయపు పన్ను రద్దు చేయాలి : BJP నేత షెహజాద్ పూనావాలా

©️ VIL Media Pvt Ltd.