Reading Time: < 1 minute

హైదరాబాద్లో క్యూకే ఇంజనీరింగ్సెంటర్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: ఏఐ రిలయబిలిటీ ఇంజనీరింగ్ సంస్థ క్వాలిటీ కియోస్క్ (క్యూకే) టెక్నాలజీస్ హైదరాబాద్‌‌‌‌లో ఇంజనీరింగ్ సెంటర్​ను ప్రారంభించింది.   ఈ సందర్భంగా సీఈవో మనీష్ జావర్​ మాట్లాడుతూ తాము ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్  సేవలు అందిస్తామని తెలిపారు.  

  ప్రస్తుతం ఇక్కడ 40 మంది పనిచేస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను ఇవ్వనున్నట్లు  ప్రకటించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్​, ఫార్మా రంగం కస్టమర్లకు ఇక్కడి నుంచి సేవలు అందిస్తామని తెలిపారు.   

©️ VIL Media Pvt Ltd.