
మహబూబ్ నగర్: గ్రామీణ యువతకు స్కిల్స్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంటకస్వామి. ఆదివారం (ఆగస్టు16) మహబూబ్ నగర్ లో ఏటీసీ సెంటర్ ను ప్రారంభించిన మినిస్టర్.. మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులు టెక్నికల్ విద్య నేర్చుకోవడం ద్వారా స్కిల్స్ పెంచుకోవాలన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా 4వేల కోట్లతో 117 ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
స్కిల్స్ పెంచుకుంటే విదేశాల్లో లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. స్కిల్ తో ఏడాదికి 25 లక్షల జీతంతో జర్మనీ, జపాన్ లో యువతకు 25 లక్షల ఉద్యోగాలున్నాయన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏనాడూ విద్యార్థులను పట్టించుకోలేదు.. ఇప్పుడు మాప్రభుత్వం విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్ కు కృష్టి చేస్తుంటే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందన్నారు .జర్మన్ భాష నేర్చుకోవడం ద్వాదా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ది జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుందన్నారు ..తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు. దేవరకద్ర బీడీ కార్మికులకోసం త్వరలో డిస్పెన్సరీ ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి.