Reading Time: 2 minutes
Venky Atluri: ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చా.. నువ్వు దీనికి సరిపోవు అని మొహంమీదే అన్నారు: వెంకీ అట్లూరి

ప్రముఖ రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి తన సినీ జీవితపు తొలినాళ్ళ గురించి, నటన ప్రయత్నాల గురించి, ఆపై రచయితగా, దర్శకుడిగా మారిన ప్రయాణం గురించి ఓ పోడ్‌కాస్ట్ షోలో వివరించారు. రీసెంట్ గా సూర్యతో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో హిట్ అందుకున్నాడు వెంకీ. అలాగే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 2001 సంవత్సరంలో తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్ వంటి నూతన నటులు నువ్వే కావాలి, జయం వంటి చిత్రాలతో భారీ విజయాలను సాధిస్తున్న సమయంలో, వెంకీ కూడా నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. తరుణ్ నా క్లాస్ మెట్ అతను సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. నేను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నా అన్నారు. ఈ క్రమంలో గంగోత్రి సినిమా ఆడిషన్స్‌కు వెళ్ళినట్లు తెలిపారు. అయితే, ఆయనకు తొలి అవకాశాన్ని కష్టపడి సంపాదించుకోలేదని, బంధువుల పరిచయంతో అది వచ్చిందని వెల్లడించారు. పోర్ట్‌ఫోలియో ఉందా.? పాస్‌పోర్ట్ ఉందా.? అనే రెండు ప్రశ్నలతోనే ఆయనను హీరోగా ఎంపిక చేశారని, ఆ చిత్రం విడుదలై పెద్ద డిజాస్టర్ అయిందని, కేవలం ఒకే షో మాత్రమే ఆడిందని వెంకీ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కూడా “నీకు నటన పలకడం లేదు, నువ్వు దీనికి సరిపోవు” అని మొఖం మీదే చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :

బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఈ అనుభవంతో ఫెయిల్డ్ యాక్టర్గా మిగిలిపోకూడదని వెంకీ నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత సుమారు ఒక సంవత్సరం తర్వాత, 2007-08 ప్రాంతంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన, మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన స్నేహగీతం సినిమా ఆడిషన్స్‌కు వెళ్ళారు. ఈ సినిమాకు నూతన నటులే కావాలి అనే నిబంధన ఉండగా, ఇప్పటికే ఒక సినిమా చేసినప్పటికీ, ఆయన మూడు-నాలుగు లెవల్స్ ఆడిషన్స్ తర్వాత ఎంపికయ్యారు. అయితే, సినిమా షూటింగ్ పది రోజులు జరిగాక, అప్పటి రచయిత తప్పుకోవడంతో చిత్ర బృందం సమస్యలో పడింది. అప్పటికే రచనపై ఆసక్తి ఉన్న వెంకీ, దర్శకుడిని అడిగి కొన్ని సీన్లు రాశారు. ఆయన రాసిన సన్నివేశాలు నచ్చడంతో, సినిమా మొత్తంలో 75 శాతం కథను వెంకీ అట్లూరి రాశారు. ఈ సినిమాకు సంభాషణల రచయితగా ఆయనకు క్రెడిట్ కూడా లభించింది. ఇదే ఆయన సినీ ప్రయాణంలో కీలక మలుపు. నటుడిగా తనను తాను సౌకర్యవంతంగా భావించలేదని, రచనలో ఆ సౌలభ్యం లభించిందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి :

వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు

స్నేహగీతం విడుదలయ్యాక నటుడిగా డీసెంట్ రివ్యూస్ వచ్చినా, ఆయన ఆసక్తి రచన వైపు మళ్లింది. తాను రాసిన కథను ఉషా మూవీస్‌కు చెప్పడానికి వెళ్ళినప్పుడు, “నువ్వు నటుడివి, రచయితగా వచ్చావా.? లేక దర్శకుడిగా వచ్చావా?” అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోయారని వెంకీ వెల్లడించారు. అప్పుడు అక్కడి డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సుధాకర్ గారు, “నటుడైతే దర్శకత్వంలో వేలు పెట్టకూడదు, దర్శకుడైతే అనుభవం కావాలి” అని స్పష్టం చేశారు. ఈ మాటలతో నటనను వదిలి, పూర్తిగా రచన, దర్శకత్వం వైపు దృష్టి సారించాలని వెంకీ నిర్ణయించుకున్నారు. అలా ఆయన రాసిన తొలి కథ మిస్టర్ మజ్ను అని, ఆ తర్వాత అదే ప్రయాణంలో తొలి ప్రేమ కథను వివరించినట్లు తెలిపారు. కేరింత సినిమా కోసం వంశీ గారితో ట్రావెల్ చేస్తున్న సమయంలో, ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయినా, 2012-13లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలయ్యాక ఆ ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించారని తెలిపారు. వెంకీ అట్లూరి ప్రయాణం నటుడిగా ప్రారంభమై, అనుకోని మలుపులతో రచయితగా మారి, చివరకు విజయవంతమైన దర్శకుడిగా మారాను అని వెంకీ తెలిపారు.

ఇది కూడా చదవండి :

ఆ హీరో మామూలోడు కాదు.. అతను చేసింది చూసి మాకు మైండ్ పోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.