
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చాలా కాలంగా హిట్ కోసం సతమతం అవుతున్న వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా సినిమాలు చేస్తున్నా అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతూ వచ్చాయి. చివరకు మేర్లపాక గాంధీ దర్శకత్వం చేసిన కొరియన్ కనకరాజు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ కు ఎట్టకేలకు హిట్ పడటంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్య తన కామెడీతో ఆకట్టుకున్నాడు. అలాగే వరుణ్ కు జోడీగా రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది.
ఇది కూడా చదవండి :
ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ
ఆగస్ట్ 7న థియేటర్స్ విడుదలైన కొరియన్ కనకరాజు సినిమా రీసెంట్ గా రూ. 50కోట్ల క్లబ్ లోకి చేరింది. రీజనల్ సినిమా పదిరోజుల్లో రూ. 50కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా పెద్ద విజయమే.. ఇప్పటికీ థియేటర్స్‌లో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికర విషయంసోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి :
చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్
ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. కొరియన్ కనకరాజు సినిమా ఓటీటీ డీల్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 26 కోట్లు పెట్టి కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 10 కానీ 11 కానీ ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి :
ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.