Reading Time: < 1 minute

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలోని పలు కోర్సుల్లో సీట్ల పెంపు..ఆగస్టు 26 వరకు దరఖాస్తులకు చాన్స్

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2026–-27 విద్యా సంవత్సరానికి గానూ వివధ కోర్సుల్లో సీట్లను పెంచుతున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. పెరిగిన సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. 

థియేటర్ ఆర్ట్స్, తెలుగు, మ్యూజిక్, డ్యాన్స్, ఎంఎఫ్‌‌‌‌ఏ, బీఎఫ్‌‌‌‌ఏ, విజువల్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, హిస్టరీ అండ్ కల్చర్, లింగ్విస్టిక్స్ కోర్సుల్లో కూడా అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను చూడవచ్చని లేదా సంబంధిత విభాగాలను నేరుగా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.