
హైదరాబాద్,వెలుగు: హైదరాబాద్‌లోని ఐసీఎఫ్ఏఐ (ఇక్ఫాయ్) ఫౌండే షన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చాన్సలర్ (వీసీ)గా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎ. వినయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత విద్యా రంగంలో 27 ఏండ్లకుపైగా అనుభవం ఉన్న ఆయన, తాజాగా బాధ్యతలు చేపట్టినట్టు ఐసీఎఫ్ఏఐ గ్రూప్ బ్రాండింగ్ డైరెక్టర్ సుధాకర్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఐఐఎం లక్నోలో ఫైనాన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసిన వినయ్ కుమార్‌కు.. అకడమిక్ లీడర్‌షిప్, రీసెర్చ్, గవర్నెన్స్ విభాగాల్లో విశేష అనుభవం ఉంది.