
నటుడు ఆదిత్య మీనన్ గుర్తున్నాడా.? విలన్ గా టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో ఆదిత్యమీనన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే విభిన్నమైన పాత్రలు చేస్తూ రాణిస్తున్నాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య మీనన్ చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఆదిత్య మీనన్. ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో కలిసి సింహా చిత్రంలో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ఆదిత్యమీనన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గురించి మొదట తాను చాలా మంది నుండి భిన్నమైన అభిప్రాయాలు విన్నానని, ఆయన కోపంగా ఉంటారని, ఎదుటివారిని కొట్టేస్తారని, నెగెటివ్ గా మాట్లాడేవారని ఆదిత్య మీనన్ తెలిపారు.
ఇది కూడా చదవండి :
ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ
అయితే, బాలకృష్ణను వ్యక్తిగతంగా కలిసిన తర్వాత, ఆయన నిజ స్వభావం తాను విన్నదానికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆదిత్య మీనన్ తెలుసుకున్నారట. బాలకృష్ణ అద్భుతమైన మనిషి. బాలకృష్ణ చాలా ప్రేమగా, సులువుగా పలకరించే వ్యక్తి అని, అలాగే ఆయన ఒక తెలివైన వ్యక్తి అని ఆదిత్య మీనన్ పేర్కొన్నారు. ప్రతిరోజూ షూటింగ్ సెట్‌లో బాలకృష్ణతో కలిసి కూర్చొని చాలా సేపు వివిధ విషయాల గురించి మాట్లాడేవారమని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి :
చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్
ముఖ్యంగా, వివిధ సంస్కృతులు, ఆచారాల గురించి బాలకృష్ణకు లోతైన అవగాహన ఉందని, అలాగే కళ పట్ల ఆయనకు అపారమైన అభిరుచి, ప్రేమ ఉన్నాయని, ఇది ఒక కళాకారుడికి చాలా ముఖ్యమని ఆదిత్య మీనన్ అన్నారు. బాలకృష్ణను దగ్గర నుండి చూసిన తర్వాత, ఆయన గురించి తాను మొదట విన్న అపోహలన్నీ తొలగిపోయాయని, ఆయన నిజంగా గొప్ప వ్యక్తిత్వం గలవారని, కళను ఎంతగానో ప్రేమించే వ్యక్తి అని ఆదిత్య మీనన్ స్పష్టం చేశారు. ఈ అనుభవం ఆయన గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఆదిత్యమీనన్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి :
ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.