Reading Time: 2 minutes
నాణేలపై ఉన్న ఆ గుర్తులకు అర్థమేంటి? 99 శాతం మందికి తెలియని విషయం

డిజిటల్ యుగంలో వీటి వాడకం చాలా వరకు తగ్గిపోయినా.. అప్పుడప్పుడూ మన చేతికి రూపాయి నాణేలు వస్తూనే ఉంటాయి. మన చేతుల్లోకి వచ్చే రూ. 1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను నిశితంగా గమనిస్తే వాటిని తయరు చేసిన సంవత్సరం కనిపిస్తుంది. దాని కింద చిన్న చుక్క, వజ్రం లేదా నక్షత్రం వంటి గుర్తులు కనిపిస్తాయి. చాలామందికి ఇవి డిజైన్‌లో భాగమని అనిపించినా.. నిజానికి ఈ గుర్తులకు ప్రత్యేకమైన అర్థం ఉంది. అవి ఆ నాణెం ఏ మింట్ కేంద్రంలో తయారైందో తెలియజేస్తాయి.

ప్రస్తుతం భారతదేశంలో ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, నోయిడాలో నాణేలను తయారు చేసే మింట్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో మింట్ కేంద్రానికి ప్రత్యేక గుర్తు(మింట్ మార్క్) ఉంటుంది. ఆ గుర్తులనే అక్కడ తయారుచేసే నాణేలపై వాడుతారు.

  1. స్టార్ (Star Mark): హైదరాబాద్‌లోని టంకశాల 1803లో ఏర్పాటైంది. ఇక్కడ తయారయ్యే నాణేలపై సాధారణంగా స్టార్ (★) గుర్తు ఉంటుంది.
  2. డైమండ్ (Diamond Mark): 1829లో స్థాపించబడిన ముంబై టంకశాల నాణేలపై డైమండ్ (♦) గుర్తు కనిపిస్తుంది. కొన్ని ప్రూఫ్ నాణేలపై ‘B’ లేదా ‘M’ అక్షరాలు కూడా కనిపించే అవకాశముంది.
  3. చిన్న చుక్క (Dot Mark): 1988లో ప్రారంభమైన నోయిడా టంకశాల నాణేలపై చుక్క (•) గుర్తును ఉపయోగిస్తుంది.
  4. ఏ గుర్తు లేకపోతే (No Mark): 1757లో స్థాపించబడిన కోల్‌కతా టంకశాల భారతదేశంలోని పురాతన టంకశాలల్లో ఒకటి. ఇక్కడ తయారయ్యే నాణేలపై ప్రత్యేకమైన మింట్ మార్క్ ఉండదు.

ఇకపై మీ చేతిలో ఉన్న నాణెంపై సంవత్సరం కింద ఉన్న చిన్న గుర్తును పరిశీలించండి. నక్షత్రం ఉంటే హైదరాబాద్, వజ్రం ఉంటే ముంబై, చుక్క ఉంటే నోయిడా, గుర్తు లేకపోతే కోల్‌కతా టంకశాలలో తయారైనట్టు అర్థం.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న 1. భారతీయ రూపాయి నాణేలపై చుక్క, వజ్రం, నక్షత్రం గుర్తులు ఎందుకు ఉంటాయి?

జవాబు: ఈ గుర్తులను మింట్ మార్కులు అంటారు. నాణెం ఏ టంకశాలలో తయారైందో గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు.

ప్రశ్న 2. నాణెంపై నక్షత్రం గుర్తు ఉంటే అది ఎక్కడ తయారైంది?

జవాబు: నాణెంపై నక్షత్రం (★) గుర్తు ఉంటే సాధారణంగా అది హైదరాబాద్ టంకశాలలో తయారైనదిగా గుర్తిస్తారు.

ప్రశ్న 3. నాణెంపై వజ్రం గుర్తు ఏ టంకశాలను సూచిస్తుంది?

జవాబు: వజ్రం (♦) గుర్తు సాధారణంగా ముంబై టంకశాలను సూచిస్తుంది.

ప్రశ్న 4. చుక్క గుర్తు ఉన్న నాణేలు ఎక్కడ తయారవుతాయి?

సంవత్సరం కింద చిన్న చుక్క (•) గుర్తు ఉంటే అది సాధారణంగా నోయిడా టంకశాలలో తయారైన నాణెంగా పరిగణిస్తారు.

ప్రశ్న 5. నాణెంపై ఎలాంటి మింట్ మార్క్ లేకపోతే దాని అర్థమేంటి?

నాణెంపై మింట్ మార్క్ కనిపించకపోతే అది సాధారణంగా కోల్‌కతా టంకశాలలో తయారైన నాణెంగా గుర్తిస్తారు.