Reading Time: 2 minutes

Vishwanath & Sons Box Office: 4 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’!

Caption of Image.

కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ . భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ భాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు నుంచే ఊహించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి మెప్పును సొంతం చేసుకుంది. తమిళనాట మాత్రమే కాకుండా  తెలుగు రాష్ట్రాల్లో, అమెరికాలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

ఇటీవలే  ‘కరుప్పు’ మూవీతో బ్లాక్ బస్టస్ట్ అందుకున్న సూర్య ఖాతాలో ఈ మూవీ కూడా చేరినట్లే అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్ యాక్షన్ చిత్రాల తర్వాత తర్వాత పూర్తిగా  క్లాస్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ మోడ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు సూర్య.. ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుతూ దూసుకెళ్తున్నారు. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అటు  సూర్య, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే కావడం, సక్సెస్ ఫుల్ గా షోస్ రన్ కావడంతో మూవీ టీం ఫుల్ జోష్ లో ఉంది.

►ALSO READ | Ravi Teja: U/A సర్టిఫికెట్తో థియేటర్లోకి ‘ఇరుముడి’.. పెయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ కీలక నిర్ణయం!

ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సూర్య ఇమేజ్‌కు తగ్గట్టుగా వెంకీ అట్లూరి మలచడం ఈ సినిమాకు ప్లస్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు సెకండ్ వీక్ కూడా ఇవే కలెక్షన్లు మరింత పెరిగితే బ్రేక్‌ఈవెన్ దిశగా ఈ సినిమా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మాస్‌తో మాత్రమే కాదు, క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తోనూ థియేటర్లను షేక్ చేయగలనని సూర్య మరోసారి నిరూపిస్తున్నాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..

ఈ మూవీలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఇక  రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్, నాజర్, సునీల్ రెడ్డి కీలక పాత్రల్లో అలరించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్  బ్యానర్ పై నాగ వంశీ ఈ భారీ బడ్జెట్ ను నిర్మించారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మరి ఈ శుక్రవారం ఆగస్టు 21న భారీ అంచనాలతో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రం నుంచి ఎలాంటి పోటీ ఉంటుందో ఆసక్తి నెలకొంది..

  

©️ VIL Media Pvt Ltd.