Reading Time: < 1 minute

84కే 4 వికెట్లు.. మరో 288 రన్స్ చేస్తేనే లంక గెలిచేది.. లేకపోతే విజయం భారత్దే

Caption of Image.

IND vs SL: భారత్ వర్సెస్ శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌ నాలుగో రోజు ముగిసే సమయానికి టీమిండియా పూర్తి పైచేయి సాధించింది. ఆతిథ్య లంక జట్టు ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఇక ఇన్సింగ్స్ లో లభించిన 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన భారత్, చివరకు శ్రీలంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. లంక గెలవాలంటే ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉండగా, టీమిండియాకు చారిత్రాత్మక విజయం సాధించడానికి కేవలం 6 వికెట్లు తీస్తే సరిపోతుంది. 

సెకండ్ ఇన్నింగ్స్‌లో తడబడిన భారత్:  

భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. క్రమశిక్షణతో కూడిన లంక బౌలింగ్‌కు వరుసగా ఇండియన్ బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో జట్టు 193 పరుగులకే ఆలౌట్ అయింది. అయినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 178 పరుగుల భారీ లీడ్ పుణ్యమా అని శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ ని ఉంచగలిగింది. గాలే పిచ్‌పై చివరి రోజు ఈ కొండంత స్కోరును ఛేజ్ చేయడం లంకకు కష్టమే అని చెప్పాలి. 

84/4 వద్ద నిలిచిన నాలుగో రోజు ఆట: 

లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆఖరి సెషన్‌లో భారత బౌలర్లు బ్రేకులు వేశారు. పక్కా ప్లానింగ్‌తో దాడి చేసిన టీమిండియా బౌలర్లు, లంక టాప్ ఆర్డర్‌ను దెబ్బతీస్తూ 4 కీలక వికెట్లను నేలకూల్చారు. వెలుతురు లేమి (Bad Light) కారణంగా 34 ఓవర్లు ముగిశాక నాలుగో రోజు ఆటను నిలిపివేసే సమయానికి శ్రీలంక 84 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం క్రీజులో సోనల్ దినూష  (25 రన్స్), ధనంజయ డి సిల్వా (31) నాటౌట్ గా కొనసాగుతున్నారు. కాగా మ్యాచ్ రేపటికి వాయిదా పడినప్పటికీ, విజయం మాత్రం దాదాపు భారత్ సొంతమైనట్లే కనిపిస్తోంది. 

►ALSO READ | అర్జున అవార్డు విజేతలకు ప్రైజ్మనీ ఎంతిస్తారో తెలుసా?.. పూర్తి వివరాలు ఇదిగో!

©️ VIL Media Pvt Ltd.