
అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అధికారులలో ఎలాంటి మార్పు రావట్లేదు. తరచూ ఎక్కడో ఒక చోట ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ పట్టుబడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో అవినీతి అధికారిని లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫూల్ బాగ్ జీహెచ్ఎంసీ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న ప్రభావతి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మంగళావారం ( ఆగస్టు 18 ) జరిగిన ఈ తనిఖీలకుఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
ఫూల్ బాగ్ జీహెచ్ఎంసీ ఆఫీసులో అవినీతిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ప్రభావతి లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ప్రభావతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
►ALSO READ | మూడు రోజులు ఓపిక పట్టండి… ఇబ్బందులన్నీ క్లియర్ చేస్తాం… KBR పార్క్ ట్రాఫిక్ పై సజ్జనార్ కామెంట్స్..
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి ఆరోపణలు వస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.