Reading Time: < 1 minute
సముద్రంలో నిప్పుల తుఫాను.. 70 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్ దిశగా ఎల్ నినో? తెలుగురాష్ట్రాల పరిస్థితి ఏంటి?

వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎల్‌నీనో బిగ్‌ షాక్ ఇచ్చింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎల్ నినో భూతం వేగంగా బలపడుతోంది. ఇది 2026 అక్టోబర్-డిసెంబర్ నాటికి, 1950 తర్వాత నమోదైన మిగతా ఎల్ నినోల తీవ్రత కంటే 69 శాతం ఎక్కువగా ఉండొచ్చని NOAA నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇదే విషయాన్ని భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పార్లమెంటు ముందు సైతం తీసుకొచ్చింది.ఎల్‌నీనలో ప్రభావంతో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి రుతుపవనాల్లో కనిపించని వర్షపాతం

పసిఫిక్ మహాసముంద్రంలోని నీరు వేడెక్కడం నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.ఈ కారణంగానే గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా నయోదైంది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. మన దేశంలో జూన్ 1 నుంచి ఆగస్టు 14 మధ్య కాలంలో దీర్ఘకాలిక సగటులో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. అంటే ఇది సాధారణం కంటే చాలా తక్కువ అని IMD స్పష్టం చేసింది.

ఈశాన్య రుపవనాల రాకతో చిగురించిన ఆశ

ఇదిలా ఉండగా మరో శుభవార్త కూడా చెప్పింది. ఈ ఎల్ నినో ప్రభావం సాధారణంగా నైరుతి రుతుపవనాల వర్షాలను తగ్గించినప్పటికీ.. అక్టోబర్-డిసెంబర్ మధ్య దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలలో ఈశాన్య రుతుపవనాల రాక కొనసాగుతుంది. ఆ రుతువపణాలపై ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపకపోవచ్చని అంచనా వేసింది.. అంటే రాబోయే రోజుల్లో ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో బలపడుతున్న పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. ఒక వేళ ఈ ఓషన్ డైపోల్‌ కనుక అక్కడే స్థిరపడితే.. దక్షిణాతి రాష్ట్రాలపై ఎల్ నినో చూపే ప్రతికూల ప్రభావం తగ్గి.. వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.